ఎస్సీల మనో భావాలను దెబ్బతీసిన చంద్రబాబుపై చర్యలు ..
- February 09, 2016
ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబాబు నాయుడు చేసిన కుల వివక్షపూరిత వ్యాఖ్యలపై దళిత వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితుల ఓట్లతో గెలిచి దళితులను కించపరుస్తారా అంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర నేత మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌లో విలేకరులతో మాట్లాడుతూ దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.వివాదస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై పశ్చిమగోదావరి జిల్లాలో కేసులు పెట్టారు. ఆచంట పోలీస్ స్టేషన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నేత సుంకర సీతారాం ఫిర్యాదు చేశారు.దళితులను కించపరిచిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మార్పీఎస్ నాయకుడు విజయరావు మంగళవారం కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సీల మనో భావాలను దెబ్బతీసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.మరో వైపు చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా ముఖ్యమంత్రి పై ఎస్సీ అట్రాసీటీ కేసు నమోదైంది. ఎవైఎస్సార్‌సీపీస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు ఫిర్యాదు మేరకు సీఐ మధు మంగళవారం కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఎస్సీలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సీడీని ఫిర్యాదుతో జత చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







