విడుదలకు సిద్ధమవుతున్న'కళ్యాణ వైభోగమే
- February 09, 2016
నాగశౌర్య, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నందిని రెడ్డి దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ వైభోగమే'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'ఆడియో వేడుక నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను మా చిత్రం తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రదర్శన హక్కులను 'అభిషేక్ పిక్చర్స్' సంస్థ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవల కాలంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను విడుదల చేసిన ఈ సంస్థ మా సినిమా విడుదల హక్కులను కూడా దక్కించు కోవడం విశేషం. ప్రస్తుతం యువతలో ప్రేమ, పెళ్ళిలాంటి బంధాలపై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికీ చక్కగా అర్ధ మయ్యేలా రూపొందించిన చిత్రమిది.సున్నితమైన భావోద్వేగాలకు వినోదం, సంగీతాన్ని సరైన పాళ్ళలో మేళవించి తెరకెక్కించిన కుటుంబ కథా చిత్ర మిది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ నెలాఖరులోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్ మదిరాజ్, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరి, కెమెరా: జి.వి.ఎస్.రాజు, ఎడిటర్: జునైద్ సిద్ధిక్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







