రిటైర్మెంట్ వీసా ను ప్రవేశపెట్టిన దుబాయ్
- September 03, 2020![1 రిటైర్మెంట్ వీసా ను ప్రవేశపెట్టిన దుబాయ్](https://www.maagulf.com/godata/articles/202009/DXB_1599108618.jpg)
దుబాయ్: నివాసితులు లేదా 55 ఏళ్లు పైబడిన ఏ విదేశీయుడైనా ఇప్పుడు ఐదేళ్ల రిటైర్మెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసా కి దరఖాస్తు చేసుకోదలచినవారు http://www.retireindubai.com లో దరఖాస్తు చేసుకోవచ్చు అని సెప్టెంబర్ 2 న ప్రకటించబడింది. దీంతో పదవీ విరమణ పొందివారు తమ కొత్త ఇన్నింగ్స్ ను దుబాయ్‌లో ప్రారంభించవచ్చు.
అయితే ఈ వీసా పొందదలచినవారికి కొన్ని షరతులు వర్తిస్తాయి. అవి, పదవీ విరమణ చేసినవారికి పెట్టుబడుల నుండి లేదా పెన్షన్ల నుండి నెలవారీ 20,000 దిర్హాముల ఆదాయం ఉండాలి; లేదా 1 మిలియన్ దిర్హాముల పొదుపు; లేదా దుబాయ్‌లో 2 మిలియన్ దిర్హాముల విలువైన ఆస్తి ఉండి ఉండాలి.
యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ పథకాన్ని దుబాయ్ టూరిజం మరియు రెసిడెన్సీ మరియు విదేశీయుల వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ ప్రారంభించింది.
దీర్ఘకాలిక నివాస వీసాలు..
2019 లో యూఏఈ దీర్ఘకాలిక నివాస వీసాల విధానాన్ని అమలు చేసింది. ఐదు మరియు 10 సంవత్సరాల వీసా పథకం క్రింద విదేశీయులకు లోకల్ స్పాన్సర్ అవసరం లేకుండా మరియు దేశ ప్రధాన భూభాగంలో వారి వ్యాపారం యొక్క 100 శాతం యాజమాన్యంతో యూఏఈ లో నివసించడానికి, పని చేసేందుకు మరియు విద్యను అభ్యసించేందుకు వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్
- విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభించిన ఎంపీ బాలశౌరి
- ITR ఫైలింగ్.. ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా ఫైల్ చేయాలి?
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- మధ్యతరహా పరిశ్రమల పై కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు..
- $1.5 మిలియన్ యూఎస్ జరిమానా.. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ క్లారిటీ
- జెడ్డాలో భవనం కూలి ఏడుగురు మృతి..పలువురు అరెస్ట్
- మంగాఫ్ అగ్నిప్రమాదం.. నిలకడగా 31 మంది ఆరోగ్యం
- ఖతార్ లో భారీగా పెరిగిన ట్రావెల్ ఫ్యాకేజీల సేల్స్
- ఇ-స్పోర్ట్స్ ఔత్సాహికుల కోసం సిద్ధమైన GCC లీగ్ 2024 ఫైనల్స్