మెట్రో ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి కాదు!
- September 03, 2020
న్యూ ఢిల్లీ:మెట్రో ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పని సరి కాదని ప్రభుత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబర్ 7నుంచి భారత దేశవ్యాప్తంగా మెట్రో సేవలు మొదలవుతున్న విషయం తెలిసిందే. దీంతో, మెట్రో ప్రయాణికులు ఆరోగ్యసేతు యాప్ ను తప్పని సరిగా డౌన్లోడ్ చేసుకోవాలనే నిబంధనను కేంద్రం తప్పని సరి చేయాలనే యోచనలో ఉన్నట్టు ప్రచారం సాగింది. అయితే, మెట్రో ప్రయాణాలు మొదలవుతున్న నేపథ్యంలో కేంద్రం మెట్రో రైలు కార్పొరేషన్ల ఎండీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎండీలంతా ఆరోగ్యసేతు యాప్ తప్పని చేసి చేస్తే.. స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. దీంతో కేంద్రం ఈ మేరకు ఆరోగ్యసేతు యాప్ తప్పని సరి కాదని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







