'Plasma Volunteers-For Cause' షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన సీపీ సజ్జనార్

- September 05, 2020 , by Maagulf
\'Plasma Volunteers-For Cause\' షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన సీపీ సజ్జనార్
హైదరాబాద్:కరోనాను జయించిన వారు..కరోనాతో  బాధపడుతున్న వారికి ప్లాస్మా దానం చేసి... ప్రాణ దాతలు అవ్వండంటూ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ ఇచ్చిన పిలుపు మేరకు ప్లాస్మా వాలంటీర్స్  చేస్తున్నసేవలను వివరిస్తూ డా.తోట శ్రీకాంత్ కుమార్ రూపొందించిన "Plasma Volunteers-For Cause" అనే అవగాహన చిత్రాన్ని ఈరోజు సీపీ ఆఫీసులో సైబరాబాద్ సీపీ విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా సీపీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ డా.తోట శ్రీకాంత్ కుమార్, ప్లాస్మా వలంటీర్లను తోట వేణు, రాము ను అభినందించి సత్కరించారు.
 
ఈ కార్యక్రమంలో ఏడీసీపీ ట్రాఫిక్/ కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇన్ ఛార్జ్ ప్రవీణ్ కుమార్,ఈఓడబ్ల్యూ ఇన్ స్పెక్టర్ హనుమంత రావు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com