హ్యామన్‌ ట్రాఫికింగ్‌:నిందితుల అప్పీల్‌ని తిరస్కరించిన న్యాయస్థానం

- September 05, 2020 , by Maagulf
హ్యామన్‌ ట్రాఫికింగ్‌:నిందితుల అప్పీల్‌ని తిరస్కరించిన న్యాయస్థానం

మనామా:బహ్రెయిన్‌ కోర్ట్‌, ఇద్దరు వ్యక్తుల అప్పీల్‌ని కొట్టి పారేసింద. నిందితులు, హ్యామన్‌ ట్రాఫికింగ్‌ కేసులో అరెస్ట్‌ అయ్యారు. నిందితులకు 2,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా, రెండేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. నిందితులతోపాటు ఓ మహిళకూ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. కాగా, నిందితుల్లో ఇద్దరు వలసదారులు కాగా, ఈ ఇద్దరూ తమపై న్యాయస్థానం విధించిన శిక్షను పై కోర్టులో అప్పీల్‌ చేశారు. వారి అప్పీల్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. ఫేక్‌ జాబ్‌ ఆఫర్స్‌తో వీరు ఇతరుల్ని మోసం చేసినట్లు గుర్తించారు. ఓ అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకుని, అక్కడ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ నిమిత్తం ఫేక్‌ జాబ్‌ లెటర్స్‌తో బహ్రెయిన్‌కి మహిళల్ని తీసుకొస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com