సౌదీ:విదేశాలకు అక్రమంగా డబ్బు బదిలీ చేసిన కేసులో 9 మంది ప్రవాసీయుల అరెస్ట్

- September 06, 2020 , by Maagulf
సౌదీ:విదేశాలకు అక్రమంగా డబ్బు బదిలీ చేసిన కేసులో 9 మంది ప్రవాసీయుల అరెస్ట్

రియాద్:విదేశాలకు అక్రమంగా డబ్బు బదిలీ చేస్తున్న 9 మంది ప్రవాసీయులను సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ తమ సౌదీకి చెందిన వ్యక్తులుగా తప్పుడు వివరాలతో వ్యక్తిగత బిజినెస్ అకౌంట్లను తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా మనీ ఎక్సేంజ్ చేయటం ద్వారా కమిషన్లు తీసుకుంటూ  నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు. అరెస్టైన ప్రవాసీయుల్లో ముగ్గురు సిరియన్లు, ముగ్గురు ఈజిప్టియన్లు, ఒకరు యెమన్ జాతీయుడు, ఒక పాకిస్తానీ, ఒక తుర్కిష్ జాతీయుడు ఉన్నట్లు నిందితుల వివరాలను పోలీసులు వివరించారు. నిందితుల నుంచి ఒక మిలియన్ రియాల్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు అక్రమాలకు పాల్పడినట్లు తేలటంతో వారిని తర్వాతి న్యాయ విచారణకు సిఫార్సు చేశామన్నారు. ఇదిలాఉంటే..గత నెలలో ఇదే తరహాలో విదేశాలకు అక్రమంగా నగదు బదిలీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ముఠా 500 మిలియన్ రియాల్స్ ను విదేశాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com