దుబాయ్:క్లాసిక్ వాహనాలకు కొత్త తరహా నెంబర్ ప్లేట్లు..

- September 06, 2020 , by Maagulf
దుబాయ్:క్లాసిక్ వాహనాలకు కొత్త తరహా నెంబర్ ప్లేట్లు..

దుబాయ్:దుబాయ్ లోని క్లాసిక్ కార్లకు నెంబర్ ప్లేట్ల డిజైన్ మారనుంది. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సూచనలకు అనుగుణంగా 1980లలో వినియోగించిన నెంబర్ ప్లేట్ల ప్రేరణతో ఈ కొత్త ప్లేట్లను రూపొందించినట్లు దుబాయ్ రోడ్డు రవాణా అధికారులు(ఆర్టీఏ) అధికారులు వివరించారు. ప్రస్తుతం క్లాసిక్ కార్లకు బ్రౌన్ కలర్ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. అయితే..కొత్త ప్లేట్లలో బ్రౌన్ కలర్ స్థానంలో పసుపు రంగును వాడనున్నారు. పసుపు రంగు సగం, తెలుపు రంగు సగం ఉంటుంది. పసుపు రంగు బ్యాక్ గ్రౌండ్ పై దుబాయ్, క్లాసిక్ అనే పదాలు అరబిక్, ఇంగ్లీష్ భాషలో ఉంటాయి. మిగిలిన సగం నెంబర్ ప్లేటుపై తెలుగు రంగు బ్యాక్ గ్రౌండ్ పై బ్లాక్ కలర్ లో నెంబర్లు ఉంటాయి. ఈ కొత్త నెంబర్ ప్లేట్లు సాంకేతిక ప్రమాణాలకు తగినట్లుగా రూపొందించినట్లు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు..దూరం నుంచి కూడా నెంబర్ ప్లేట్ పై అక్షరాలు, నెంబర్లను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని వివరించారు. ఇక 30 ఏళ్ల నాటి వాహనాలకు కూడా కొత్త క్లాసిక్ నెంబర్ ప్లేట్లు జారీ చేస్తామని, అయితే..ఫిట్నెస్ క్లియరెన్స్ ఉండాలని ఆర్టీఏ తెలిపింది. కొత్త నెంబర్ ప్లేట్లు కావాలనుకునే వారు ఆర్టీఏ వెబ్ సైట్ ద్వారాగానీ, కస్టమర్ హ్యాపినెస్ సెంటర్ లో గానీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com