సౌదీ:విదేశాలకు అక్రమంగా డబ్బు బదిలీ చేసిన కేసులో 9 మంది ప్రవాసీయుల అరెస్ట్
- September 06, 2020
రియాద్:విదేశాలకు అక్రమంగా డబ్బు బదిలీ చేస్తున్న 9 మంది ప్రవాసీయులను సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ తమ సౌదీకి చెందిన వ్యక్తులుగా తప్పుడు వివరాలతో వ్యక్తిగత బిజినెస్ అకౌంట్లను తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా మనీ ఎక్సేంజ్ చేయటం ద్వారా కమిషన్లు తీసుకుంటూ నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు. అరెస్టైన ప్రవాసీయుల్లో ముగ్గురు సిరియన్లు, ముగ్గురు ఈజిప్టియన్లు, ఒకరు యెమన్ జాతీయుడు, ఒక పాకిస్తానీ, ఒక తుర్కిష్ జాతీయుడు ఉన్నట్లు నిందితుల వివరాలను పోలీసులు వివరించారు. నిందితుల నుంచి ఒక మిలియన్ రియాల్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు అక్రమాలకు పాల్పడినట్లు తేలటంతో వారిని తర్వాతి న్యాయ విచారణకు సిఫార్సు చేశామన్నారు. ఇదిలాఉంటే..గత నెలలో ఇదే తరహాలో విదేశాలకు అక్రమంగా నగదు బదిలీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ముఠా 500 మిలియన్ రియాల్స్ ను విదేశాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







