ఇండియన్‌ కమ్యూనిటీ మెంబర్స్‌ కోసం ఐసీబీఎఫ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీం

- September 07, 2020 , by Maagulf
ఇండియన్‌ కమ్యూనిటీ మెంబర్స్‌ కోసం ఐసీబీఎఫ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీం

దోహా: ఐసీబీఎఫ్‌, ఐసీబీఎఫ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీంని దమాన్‌ ఇస్లామిక్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ (బీమా)తో కలిసి ప్రారంభించడం జరిగింది. ఖతార్‌లో స్థిరపడ్డ భారతీయుల కోసం ఈ ఇన్స్యూరెన్స్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. రెండేళ్ళకుగాను కేవలం 125 ఖతారీ రియాల్స్‌ ఖర్చుతో 100,000 ఖతారీ రియాల్స్‌ కవరేజ్‌ దక్కేలా ఈ ఇన్స్యూరెన్స్‌ పాలసీని రూపొందించారు. 2019 డిసెంబర్‌లో ఈ పథకం ప్రారంభమయ్యింది. అతి తక్కువ సమయంలోనే ఇది చాలా పాపులర్‌ అయ్యింది. అతి తక్కువ ఖర్చుతో ఈ సౌకర్యం కల్పించడం చాలా గొప్ప విషయమని ఐసీబీఎఫ్‌ ప్రెసిడెంట్‌ పిఎన్‌ బాబురాజన్‌ చెప్పారు. కమ్యూనిటీ ఈ స్కీర్‌ రీ-స్టార్ట్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన వివరించారు. పర్మనెంట్‌ లేదా పాక్షిక డిజేబిలిటీకి అత్యధిక మొత్తం కవర్‌ అయ్యేలా ఈ స్కీంని రూపొందించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com