యూఏఈ:వీసా గడువు ముగిసిన వారికి ముంచుకొస్తున్న డెడ్ లైన్..మరో 4 రోజులే గడువు
- September 07, 2020
యూఏఈ:మార్చి 1తో యూఏఈ విజిట్, టూరిస్ట్ వీసాల గడువు ముగిసిన వారికి హెచ్చరిక.! ఎలాంటి అపరాధ రుసుము చెల్లించకుండా దేశం విడిచి వెళ్లేందుకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉంది. యూఏఈ పౌర గుర్తింపు ఫెడరల్ అధికార విభాగం తాజాగా జారీ చేసిన ప్రకటన మేరకు విజిట్, టూరిస్ట్ వీసా గడువు ముగిసన వారు సెప్టెంబర్ 11 నాటికి దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి కరోనా మహమ్మారి పరిస్థితులతో విమాన సర్వీసులు రద్దవటం కారణంగా వీసా గడువును వచ్చే డిసెంబర్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ, ఆ తర్వాత అన్ లాక్ ప్రక్రియతో పరిస్థితులు కొద్దిమేర మెరుగుపడటం..ప్రత్యేక విమాన సర్వీసులు అందుబాటులో ఉండటంతో డిసెంబర్ వరకు వీసాల పొడగింపు నిర్ణయాన్ని రద్దు చేసింది యూఏఈ. అయితే..విజిట్, టూరిస్ట్ వీసాదారులకు మరో వెసులుబాటు కలిపించేలా ఆగస్ట్ 11 నుంచి నెల రోజుల పాటు అవకాశం ఇచ్చింది. ఈ నెల రోజుల వ్యవధిలో వీసా గడువు ముగిసిన వారు దేశం విడిచి వెళ్తే ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు..తిరిగి యూఏఈ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ వీసా గడువు ముగిసినా సెప్టెంబర్ 11 నాటికి దేశం విడిచి వెళ్లకుంటే జరిమానా చెల్లించాల్సిందేనని యూఏఈ స్పష్టం చేసింది. వీసా గడువు దాటిన తర్వాత తొలి రోజున Dh200 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి రోజుకు Dh100 జరిమానా చెల్లించాలి. దీనికితోడు Dh100 సర్వీస్ చార్జ్ అదనంగా చెల్లించాలి. ఇదిలాఉంటే..వీసా గడువు ముగిసినా..యూఏఈలోనే ఉండాల్సి వచ్చిన వారు తమ వీసాలను సెప్టెంబర్ 11 నాటికి రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ప్రకటించింది.

తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







