ఏపీలో ఆగని కరోనా విజృంభణ
- September 08, 2020
అమరావతి:ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70,993 శాంపిల్స్ ని పరీక్షించగా 10,601 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల గుంటూరు లో పది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, చితూర్ లో ఎనిమిది మంది, కడప లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, నెలూరు లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు , విజయనగరం లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 11,691 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 5,14,199 పాజిటివ్ కేసు లకు గాను 4,12,870 మంది డిశ్చార్జ్ కాగా.. 4,560 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,769 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







