'వి'పై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు - హీరో నాని
- September 08, 2020
నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల ఆయిన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా నాని పాత్రకు వస్తోన్న ప్రసంశలు చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో తెలుసుకోవచ్చు.
తన అభిననులకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు ఈ సందర్భంగా నాని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 12 ఏళ్ల క్రితం నా మొదటి సినిమా విడుదలైనప్పుడు నేను ఊహించలేదు ఇప్పుడు నాపై ఇంతటి ప్రేమ, ఆదరణ లభిస్తుందని నాని తెలిపారు.
మొదటిసారి ఒక నెగిటీవ్ పాత్ర చేసినప్పటికి అభిమానులు నన్ను ఎంతగానో ఆదరించారు. నా 25వ సినిమాపై ఇంతటి అభిమానం చూపించిన అందరికి కృతజ్ఞతలు. నా సినిమా విడుదలైతే థియేటర్స్ దగ్గరికి ఆడియన్స్ రావడం జరుగుతుంది. కానీ ఈసారి నేను మా వి టీమ్ మొత్తం మీ ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నన్ను నమ్మి నాకు ఈ పాత్ర ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి అలాగే నా తోటి నటులు సుధీర్ బాబుకు, నివేద థామస్, అతిథి రావ్ హైదరకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా వి సినిమాను విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వారికి థాంక్స్ తెలుపుతున్నాను.
ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసిన నాని, సుధీర్ బాబు వి సినిమా నాని కెరీర్ లో 25వ సినిమాగా రావడం విశేషం. అలాగే డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో నాని చేసిన మూడో సినిమా ఇది. నాని మొదటిసినిమా అష్టా చమ్మ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై 12 ఏళ్ళు అవ్వడం తిరిగి నాని, ఇంద్రగంటి వి సినిమా కోసం వర్క్ చెయ్యడం విశేషం.
న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నివేదా థామస్, అతిథి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటించిన వి సినిమాకు ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!