పబ్లిక్‌ స్కూల్‌ టీచర్స్‌, అడ్మినిస్ట్రేటర్స్‌కి కోవిడ్‌ 19 టెస్టింగ్‌

- September 09, 2020 , by Maagulf
పబ్లిక్‌ స్కూల్‌ టీచర్స్‌, అడ్మినిస్ట్రేటర్స్‌కి కోవిడ్‌ 19 టెస్టింగ్‌

మనామా: ఎడ్యుకేషన్‌ మరియు హెల్త్‌ మినిస్ట్రీస్‌, పబ్లిక్‌ స్కూల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ అలాగే టీచర్లు మరియు టెక్నీషియన్లకు కరోనా టెస్టులు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ మరియు కాన్ఫరెన్స్‌ సెంటర్‌లో ఈ టెస్టులు జరుగుతున్నాయి. అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభానికి ముందు ఈ కీలకమైన చర్యలు చేపట్టారు. సెప్టెంబర్‌ 6న పబ్లిక్‌ స్కూల్‌ స్టాఫ్‌ తమ విధుల్ని ప్రారంభించాల్సి వుండగా, అది సెప్టెంబర్‌ 20కి వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంది. ప్రతి పబ్లిక్‌ స్కూల్‌ స్టాఫ్‌కీ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి కోవిడ్‌ 19 టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది మినిస్ట్రీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com