మార్కెట్లో రష్యా వ్యాక్సిన్
- September 09, 2020
న్యూ ఢిల్లీ:రష్యాకు చెందిన గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ( ఆర్‌డిఐఎఫ్ ) చే అభివృద్ధి చేయబడిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ విని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 11 న స్పుత్నిక్ వి అనే కోవిడ్ -19 పై మొదటి టీకాను నమోదు చేసింది. రష్యా తన వ్యాక్సిన్ ను భారత్ లో మూడో దశ ప్రయోగాలు జరిపి మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉంది. దీనికి సంబంధించి రష్యా నుంచి ప్రతిపాదనలు అందినట్లుగా నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనల్ని మన దేశంలో పలు మెడికల్ కంపెనీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలు రష్యా వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు చేశాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..