మస్కట్: నవంబర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, స్థానిక పునరావాస కేంద్రాలకు అనుమతి
- September 10, 2020
మస్కట్:ఒమన్ లోని అన్ని గవర్నరేట్ల పరిధిలో పునరావాస కేంద్రాల ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పునరావాస కేంద్రాలతో పాటు స్థానికంగా ఉండే పునరావాస కేంద్రాలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే..కరోనా నేపథ్యంలో ఆరోగ్య శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే దివ్యాంగులైన చిన్నారుల మానసికోల్లాసానికి తోడ్పడేలా అహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!