తెలంగాణలో లక్ష 50 వేల మార్కు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

- September 10, 2020 , by Maagulf
తెలంగాణలో లక్ష 50 వేల మార్కు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట్లలో కొత్తగా 2,534 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య లక్ష 50వేల మార్కు దాటింది. మొత్తం కరోనా కేసులు 1,50,176గా నమోదయ్యాయి. తాజాగా 11 మందిని ఈ మహమ్మారి బలితీసుకోగా.. మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. అయితే, కరోనా నుంచి ఇప్పటివరకూ 1,17,143 మంది కోలుకోగా.. ఇంకా 25,066మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 78శాతంగా ఉంది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com