ఇండియన్‌ ఎంబసీ - టీచర్లకు సన్మానం

- September 11, 2020 , by Maagulf
ఇండియన్‌ ఎంబసీ - టీచర్లకు సన్మానం

దోహా:ఖతార్‌లో భారత రాయబారి డాక్టర్‌ దీపక్‌ మిట్టల్‌, పలువురు భారతీయ టీచర్లను సత్కరించారు. కమ్యూనిటీ బిల్డింగ్‌, ఎకనమిక్‌ ఎక్స్‌లెన్స్‌, సోషల్‌ సర్వీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రిజర్వేషన్‌ వంటి అంశాల్లో తమవంతు పాత్ర పోషిస్తోన్న టీచర్లను ఇండియన్‌ ఎంబసీ - టీచర్స్‌ ఫెలిసిటేషన్‌ సెర్మనీ సందర్భంగా సత్కరించడం జరిగింది. యూ ట్యూబ్‌లో ఈ కార్యక్రమం లైవ్‌లో ప్రసారమైంది. ఈ సందర్భంగా రాయబారి దీపక్‌ మిట్టల్‌, ఉపాధ్యాయుల సేవల్ని కొనియాడారు. బిర్లా పబ్లిక్‌ స్కూల్‌కి చెందిన రాకేష& వర్మ, డిపిఎస్‌ మోడర్న్‌ ఇండియన్‌ స్కూల్‌కి చెందిన జయంతి రాజగోపాలన్‌, శాంతినికేతన్‌ ఇండియన్‌ స్కూల్‌కి చెందిన షాకిర్‌ హుస్సేన్‌లను ఈ సందర్భంగా సత్కరించారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని ఇండియన్‌ స్కూల్స్‌లో పాటించేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నాలెడ్జ్‌ కంటే గొప్ప మిత్రుడు, రీడింగ్‌ కంటే గొప్ప ఆనందం ఏదీ వుండదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com