తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పాస్
- September 11, 2020
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. ఈ చట్టానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకుముందు వీఆర్‌ఓ రద్దుకు సంబంధించిన బిల్లును కూడా సభ ఆమోదించింది. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ బిల్లుపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చను మొదట సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులు చర్చ కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చట్టంపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఇక వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కావడంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైస్ సభ దృష్టికి తెచ్చారు. అయితే వక్ఫ్, దేవాదాయ భూములు ఇక నుంచి రిజిస్ట్రేషన్ కాకుండా ధరణి పోర్టల్‌లో ఆటో లాక్ అవుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!