కొత్త చట్టాన్ని స్వాగతించిన టి-హోంమంత్రి మహమూద్ అలీ

- September 11, 2020 , by Maagulf
కొత్త చట్టాన్ని స్వాగతించిన టి-హోంమంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన “తెలంగాణ భూమిపై హక్కులు మరియు పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం 2020” హోం శాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ స్వాగతించారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ శాసనసభలో  ప్రవేశపెట్టిన ఈ బిల్లు విప్లవాత్మక మరియు చారిత్రాత్మక మైనదని... పెను సంస్కరణలు తీసుకువచ్చే ఈ కొత్త చట్టము వల్ల....మొత్తం రైతు సమాజం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఎదుర్కొంటున్న సమస్యలు మరియు అడ్డంకులను పూర్తిగా తొలగిస్తుందని ...... ఈ రోజు తనకు సంతోషకరమైన రోజు అని హోం మంత్రి అన్నారు. భూమికి సంబంధించిన లావాదేవీల కోసం పట్టాదర్ పాస్‌బుక్‌లు మరియు టైటిల్ డీడ్‌లను రుణాలు పొందేటప్పుడు బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టడం; బదిలీ తర్వాత వారి భూముల మ్యుటేషన్ పొందడంలో ఇబ్బందులు; వ్యవసాయ రుణాలు పొందటానికి పాస్ బుక్స్ మరియు టైటిల్ డీడ్స్ ను తనఖా కోసం పట్టుబట్టడం వంటి అనేక ఇబ్బందులను  ఈ కొత్త చట్టం నిర్ములిస్తుంది అని హోం శాఖ మంత్రి పేర్కొన్నారు. అంతే కాకుండా, ఈ ఈ కొత్త చట్టం ఎలక్ట్రానిక్ రూపంలో హక్కుల రికార్డుల నిర్వహణ మరియు వాటిని ధృవీకరించడం; ఎలక్ట్రానిక్ పట్టాదర్ పాస్ బుక్స్ మరియు  టైటిల్ డీడ్ పొందటానికి వీలు కల్పిస్తుంది; ఆస్తి బదిలీ అయిన వెంటనే ఆటోమేటిక్ సముపార్జన హక్కులు; ఇబ్బంది లేని రెవెన్యూ పరిపాలనను అందించి అవినీతిని నిర్మూలిస్తుంది.ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్రింద ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా పనిచేశానని.....ఈ క్రమంలో పేదలకు, రైతులకు సేవచేయడం కోసం ముఖ్య మంత్రి గారు పడే తపన, కృషికి తాను సాక్షీభూతమై ఉన్నానని ప్రజలకు మంచి పాలన అందించేందుకు  సంస్కరణలు తీసుకురావడం కోసం ,మానవతావాది, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, గొప్ప నాయకుడు . మానవతావాది, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి శ్రద్ద, అంకితభావం, తపన, అవిశ్రాంతమైన కృషి మరియు నిరంతరాయమైన ప్రయత్నాలు, నిబద్ధత మరియు అత్యంత పట్టుదలను నిశితంగా  చూశానని మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.  ధైర్యం ఉన్నవారు మాత్రమే చారిత్రక మరియు విప్లవాత్మక సంస్కరణలను తీసుకరాగాలుగుతారని అభిప్రాయపడ్డారు.రైతు బంధువు, రైతు బంధు, రైతు భీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, దేశంలోని అతిపెద్ద నీటిపారుదల మరియు తాగునీటి సరఫరా ప్రాజెక్టు “కాలేశ్వరం” వంటి అనేక కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చారన్నారు ఇటువంటి విప్లవాత్మక మరియు చారిత్రాత్మక సంస్కరణలను తీసుకురావడం  దేశంలో ఇదే మొదటిసారని .. ముఖ్యమంత్రిగా ఇంత దూరదృష్టి గల, మానవతావాది, గొప్ప నాయకుడిని పొందడం తెలంగాణ ప్రజలు అదృష్టమని ఆయన అన్నారు.

వక్ఫ్ బోర్డ్ భూములు, ఎండోమెంట్స్ మరియు ROFR యొక్క భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు ఉండవని చంద్రాయణ గుట్ట లోని బండ్లగుడ వద్ద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని  హామీ ఇచ్చినందుకు మొహమ్మద్ మహమూద్ అలీ  ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com