'రైడర్' ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల
- September 11, 2020
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు యువరాజా నిఖిల్ కుమార్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రానికి 'రైడర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను లహరి ఫిలిమ్స్ బ్యానర్‌పై చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 11న శుక్రవారం సాయంత్రం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నిఖిల్ కుమార్ పరుగెత్తుతూ కనిపిస్తున్నారు. ఆయన యాక్షన్ మోడ్‌లో ఉన్నారనీ, గూండాలను చితగ్గొడుతున్నారనీ వాళ్లు చెల్లాచెదురుగా కిందపడిపోవడం తెలియజేస్తుంది. 'రైడర్' అనే టైటిల్‌కు పూర్తి న్యాయం చేస్తున్నట్లుగా ఆ ఫస్ట్ లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు.
ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల చేసిన మోషన్ పోస్టర్ మరింత వివరంగా హీరో చేసిన యాక్షన్ ఎపిసోడ్‌ను తెలియజేస్తోంది. హీరో బాస్కెట్ బాల్‌ను విసిరేయడం, ఆ తర్వాత రన్నింగ్ చేస్తూ గూడ్స్ కంటైనర్ల మధ్య తనపైకి వచ్చిన గూండాలను ఉతికి ఆరేసినట్లు చూపించడం కనిపిస్తోంది. ఈ సినిమాతో నిఖిల్ కుమార్ ఒక ఫెరోషియస్ యాక్షన్ హీరోగా మన ముందుకు రానున్నారనే అభిప్రాయాన్ని ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కలిగిస్తున్నాయి.
'రైడర్'లో నిఖిల్ కుమార్ సరసన నాయికగా కశ్మీరా పరదేశి నటిస్తున్నారు.
అర్జున్ జన్యా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష ఎం. కుడువల్లి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణమవుతోంది.
తారాగణం:
యువరాజా నిఖిల్ కుమార్, కశ్మీరా పరదేశి, దత్తన్న, అచ్యుత కుమార్, రాజేష్ నటరంగ, శోభరాజ్, చిక్కన్న, శివరాజ్ కె.ఆర్. పీట్, నిహారిక, సంపద హుళివన, అనూష
సాంకేతిక బృందం:
రచన: నంద్యాల రవి, విజయ్ ప్రకాష్
డైలాగ్స్, కో-డైరెక్టర్: శరత్ చక్రవర్తి
మ్యూజిక్: అర్జున్ జన్యా
సినిమాటోగ్రఫీ: శ్రీష ఎం. కుడువల్లి
ఎడిటింగ్: కె.ఎం. ప్రకాష్
స్టంట్స్: డాక్టర్ రవివర్మ
ఆర్ట్: మోహన్ బి. కెరే
క్రియేటివ్ హెడ్: సునీల్ గౌడ
నిర్మాత: చంద్రు మనోహరన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







