NTR సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం

- September 12, 2020 , by Maagulf
NTR సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం

కువైట్ సిటీ:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో
NTR సేవా సమితి కువైట్ అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య  ఆధ్వర్యంలో కువైట్లో భారీగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా  తెలుగింటి ఆడపడుచులకు చీర మరియు పసుపు కుంకుమలను అందచేశారు.

అధ్యక్షుడు చుండు బాల రెడ్డయ్య నాయుడు, షేక్  సుబాన్, గుదె నాగార్జున, ఆంజనరెడ్డి, ఏనుగోండ  నరసింహ నాయుడు, షేక్ హాబిబ్ ఆధ్వర్యంలో హవల్లి ప్రాంతం నుంచి  మెదలపెట్టారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ నందమూరి తారక రామారావు మరియు చంద్రబాబు ఆశయ సాదన  కోసం నిరంతరం  పనిచేస్తామన్నారు. ఆడపడుచులను పసువు కుంకమ కార్యక్రమం క్రింద గౌరవించడం చాలా సంతోషంగా  ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మద్దిన ఈశ్వర్ నాయుడు, ఈడుపుగంటి ప్రసాద్, విక్రమ్  ఆంజి తదితరులు పాల్గొన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com