జవాన్లందరికీ పోష్టికాహారం ఇవ్వాల్సిందే-రాహుల్ గాంధీ

- September 12, 2020 , by Maagulf
జవాన్లందరికీ పోష్టికాహారం ఇవ్వాల్సిందే-రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ:భారత దేశ సరిహద్దుల్లో ఎండనక ,వాననక నిరంతరం దేశ రక్షణకోసం శ్రమిస్తున్న జవాన్లందరికీ హోదాతో నిమిత్తం లేకుండా పౌష్టికాహారం ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రక్షణ శాఖపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన, మన సైనికులకు తక్కువ స్థాయి పౌష్టికాహారాన్ని ఇవ్వడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. సైనికాధికారులతో సమానంగా అందరికీ ఈ విధమైన ఫుడ్ అందజేయాలన్నారు. అధికారులకు ఒకలాగా, సాధారణ జవాన్లకు మరొకలా ఫుడ్ ఇవ్వడం వివక్ష చూపడమే అని రాహుల్ వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రస్తుత నిబంధనలను మళ్ళీ పరిశీలించాలని ఆయన సూచించారు.అసలే చైనాతో ‘తల బొప్పి కడుతున్న’ ఈ సమయంలో ఈ విధమైన పక్షపాతం చూపడం సహేతుకం కాదని రాహుల్ మరీ మరీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com