మహిళల భద్రతకు SAFE మాడ్యూల్
- September 12, 2020
హైదరాబాద్:సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC), కాగ్నిజెంట్ కంపెనీల ఆధ్వర్యంలో సేఫ్టీ SAFE (SAFE – Safety Awareness For NEW HIRE Employees) ఈ లెర్నింగ్ అవర్నెస్ మాడ్యూల్ ను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ టైమ్ లో మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలు పెరిగిపోయాయన్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇటీ కారిడార్ లో 6 లక్షల మంది మహిళా సిబ్బంది పని చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళ భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కలిసి మార్గదర్శక్, సంఘమిత్ర వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనుడులో భాగంగా మహిళల భద్రత కు మరో ముందడుగు వేసి.. షీ సేఫ్ యాప్ ద్వారా విమెన్ సేఫ్టీ పై ఈ-లెర్నింగ్ మాడ్యూల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కొత్త గా వచ్చే మహిళ ఉద్యోగులకు ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 20 నిమిషాల ఈ లెర్నింగ్ మాడ్యూల్ ను కొత్తగా వచ్చే మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒకవేళ మహిళలు వేధింపులకు గురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి వంటి విషయాలు ఉంటాయన్నారు. విమెన్ సేఫ్టీ పై కంపెనీలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఐటీ కంపెనీలల్లో మహిళల భద్రత కు షీ టీమ్స్, భరోసా సెంటర్లు, ఎస్సిఎస్సి నిరంతరం పని చేస్తున్నాయన్నారు. మహిళల భద్రత కు ప్రతీ ఒక్క మహిళ షీ సేఫ్ యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు రెండేళ్ల లో ఎస్సీ ఎస్సీ సహకారంతో 65 వేల మంది మహిళలకు విమెన్ సేఫ్టీ పై అవగాహన కల్పించమన్నారు. అలాగే కరోనా టైంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అవసరమున్నవారికి 5,500 బ్లడ్ యూనిట్స్ సేకరించి వివిధ బ్లడ్ బ్యాంక్ లకు అందజేశాము. ప్లాస్మా డొనేషన్ డ్రైవ్ ద్వారా.. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నా 200 మంది 2000 మందికి ప్లాస్మా దానం చేశారు..
ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ యేదుల మాట్లాడుతూ.. ఎస్సీఎస్సీ విమెన్ సేఫ్టీ, రోడ్డు సేఫ్టీ పై పని చేస్తోందన్నారు. సైబరాబాద్ పోలీసులతో కలిసి ఎస్సీఎస్సీ అనేక కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. కంపెనీలన్నీ ఈ లెర్నింగ్ మాడ్యూల్ ను తమ ఉద్యోగులకు చూపించి వారికి అవగాహన కల్పించాలన్నారు. విమెన్ సేఫ్టీ కోసం మార్గదర్శక్, సంఘమిత్ర, షీ సేఫ్ యాప్ లు వంటివి తీసుకొచ్చామన్నారు. ఐటీ సంస్థల్లో కొత్త గా వచ్చే ఉద్యోగుల కోసం ఈ లెర్నింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
అనంతరం విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ మాట్లాడుతూ.. కొత్తగా వచ్చే ఉద్యోగులు పని స్థలాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అదే కాకుండా ఆన్ లైన్ లో నూ మహిళలు వేధింపులకు గురవుతున్నారని షీ టీమ్స్ కు కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్లు పని చేస్తున్నాయన్నారు. వర్క్ ప్లేస్ లో ఎవరయినా వేధింపులకు గురి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్., ఎస్సిఎస్సి జనరల్ సెక్రెటరీ కృష్ణ యేదుల, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ, ఎస్సీఎస్సీ జాయింట్ సెక్రటరీ ఫర్ విమెన్ ఫోరం ప్రత్యూష శర్మ, కృష్ణన్ అయ్యర్ ఎస్వీపీ కాగ్నిజెంట్, ఎస్సీఎస్సీ సేఫ్ ప్రాజెక్ట్ ప్రోగ్రామర్ రాధికా బుర్ర, జితేంద్ర కుచ్చా సెంటర్ హెడ్ కాగ్నిజెంట్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు