అన్ని దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల భద్రత చర్యలను పరిశీలించాలని ఆదేశాలు:ఎపి డి‌జి‌పి

- September 12, 2020 , by Maagulf
అన్ని దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల భద్రత చర్యలను పరిశీలించాలని ఆదేశాలు:ఎపి డి‌జి‌పి

విజయవాడ:అంతర్వేది ఆలయంలో  ఏళ్ల నాటి చరిత్ర కలిగిన  స్వామి వారి రథం అగ్నికి ఆహుతవ్వడం అత్యంత  దురదృష్టకరం. ఇది జరగకూడని సంఘటన. వివిధ వర్గాలకు చెందిన ప్రజల మనోభావాలతో ముడిపడిన సున్నితమైన అంశం.ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్ర ప్రదేశ్ లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపెక్షించదు వారిపైన కఠిన చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ బహిరంగ ప్రదేశాల భద్రతా చట్టం 2013 మేరకు పూర్తి స్థాయిలో  దేవాలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు అమర్చడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు,దేవాలయాలకు ఫైర్ & ఎలక్ట్రిసిటీ ఆడిట్ నిర్వహించడం, నిరంతరం రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షణ చర్యలు చేపట్టే విధంగా అవగాహన కల్పించడం తోపాటు  పెట్రోలింగ్ ను పటిష్టపరచడం, సోషల్ మీడియా పుకార్లపై నిఘా, మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు పుకార్లు నమ్మకుండా శాంతిభద్రతలకు సహకరించే విధంగా అన్ని  చర్యలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్రంలోని ప్రతి జిల్లా లో ఉన్న దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో  ట్యాగింగ్, నిరంతర నిఘా ఉండే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని  ఎస్పీలను  అప్రమత్తం  చేశాము.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com