విదేశీయులకు ఇక బహ్రెయిన్ ప్రభుత్వ కొలువుల్లో కోత తప్పదు

- February 10, 2016 , by Maagulf
విదేశీయులకు ఇక బహ్రెయిన్ ప్రభుత్వ కొలువుల్లో కోత తప్పదు

ప్రభుత్వరంగంలో బహ్రెయిన్  దేశీయులు  కాని విదీశీ ఉద్యోగులను 50 శాతం వరుకు తొలగిస్తూ సూచించిన ప్రతిపాదిన  చర్చను మంగళవారం వాయదా వేశారు. అయెతే, పార్లమెంట్ సభ్యులలో అత్యధికులు ఈ అంశంపై ,వ్యతిరేకించడంతో వారం రోజుల పాటు వాయదా వేశారు. విదీశీ ఉద్యోగులకు పని ఒప్పందం పొడగించకుండా 50 శాతం ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు ఇకపై ఇవ్వరాదని...ఆయా ఖాళీలను నిరుద్యోగులైన స్థానిక బహెరిన్ యువతతో భర్తీ చేయాలనీ పార్లమెంట్ సభ్యుడు జలాల్ కదీం, మరో నలుగురు ఎంపీల బృందం మండలి తీర్మానంలో పట్టుబట్టారు. గత మూడేళ్ళగా బహెరిన్ ప్రభుత్వరంగ వివిధ శాఖలలో 2,500 మంది విదేశీయులు పని చేస్తున్నారని వారు చెబ్తూ, సమాన విద్యార్హతలున్న  బహ్రెయిన్ నిరుద్యోగులకు ఇవ్వాలని  వారు కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com