ప్రభుత్వానికి భారీ మార్పులు: యుఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌

- February 10, 2016 , by Maagulf
ప్రభుత్వానికి భారీ మార్పులు: యుఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌


వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ది యుఏఈ మరియు దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ మాట్లాడుతూ, ఫెడరల్‌ గవర్నమెంట్‌ మినిస్ట్రీకి భారీ మార్పులు చేయనున్నట్లు ట్విట్టర్‌లో ఫాలోవర్స్‌కి లైవ్‌ కన్వర్జేషన్‌ ద్వారా తెలిపారు. యూఏఈ ఫెడరల్‌ గవర్నమెంట్‌కి సంబంధించి తన ఆలోచనల్ని, అలాగే నిర్మాణాత్మక మార్పుల గురించీ వివరించారు. యూఏఈలో అభివృద్ధిపైనా ఆయన తన ఆలోచనల్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. హ్యాపీనెస్‌ మరియు టోలరెన్స్‌కి కొత్త క్యాబినెట్‌ పోర్ట్‌ఫోలియోస్‌, అలాగే ఎడ్యుకేషన్‌ మరియు లేబర్‌ మినిస్ట్రీస్‌కి సంబంధించి మార్పులు చేర్పులు వంటివి చేపట్టనున్నామని ఆయన అన్నారు. మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ హ్యాపీనెస్‌, మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ టోలరెన్స్‌ కొత్త మంత్రిత్వ శాఖలు రానున్నాయి. మినిస్ట్రీస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మరియు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఒకే దాంట్లో కలపబడ్తాయి. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ పేరుని మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రీసోర్సెస్‌ మరియు ఎమిరటైజేషన్‌గా మార్చుతారు. క్లైమేట్‌ చేంజ్‌ డిపార్ట్‌మెంట్‌ను మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మరియు వాటర్‌కి బదిలీ చేస్తారు, దాని పేరుని మినిస్ట్రీ ఆఫ్‌ క్లైమేట్‌ చేంజ్‌ మరియు ఎన్విరాన్‌మెంట్‌గా మార్చుతారు. యూఏఈ యూత్‌ నేషనల్‌ కౌన్సిల్‌ని ఏర్పాటు చేస్తారు. యూత్‌ ఎఫైర్స్‌కి ఈ కౌన్సిల్‌ సూచనలు చేస్తుంది. 22 ఏళ్ళ మహిళా మంత్రి ఈ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com