కువైట్ లో భారీ అగ్నిప్రమాదం..
- September 13, 2020
కువైట్ సిటీ:కువైట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తన మంటలు చెలరేగటంతో దాదాపు 300 మంది అగ్నిమాపక సిబ్బందిని బరిలోకి దింపారు. అల్ సబా హెల్త్ జోన్ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పార్కింగ్ ప్రాంతం నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. అయితే..భవనంలోని కొన్ని ఫ్లోర్ లను గోడౌన్ లుగా వినియోగిస్తున్నారు. కానీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భారీగా సామాగ్రిని గోడౌన్ లో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మంటల తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని వెంటనే తగిన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అయితే..మంటల తీవ్రత ధాటికి ఘటనా స్థలంలో విపరీతమైన సెగలు వచ్చాయని, థర్మల్ కెమెరా 322 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వివరించారు. దీంతో అగ్నిమాపక సిబ్బందిలో 55 మంది అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన