సౌదీ విదేశీ కరెన్సీ మార్పిడి కార్యాలయాలకు కొత్త నిబంధనలు..
- September 13, 2020
రియాద్:సౌదీ అరేబియాలో పరిధిలోని ఫారెక్స్ అఫీసుల నిర్వహణకు కట్టుదిట్టమైన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇక నుంచి విదేశీ కరెన్సీ మార్పిడి, ఇతర లావాదేవీలు నిర్వహించే ఫారెన్స్ ఆఫీసుల నిర్వహణకు ఖచ్చితంగా సౌదీ సెంట్రల్ బ్యాంక్, సౌదీ అరేబియా మానిటరీ అథారిటీ నుంచి ఖచ్చితంగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. లైసెన్స్ గడువు ముగిసే ఆరు నెలల ముందే మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫారెన్స్ ఆఫీసుల ద్వారా కొందరు ఆర్ధిక ఆక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఇలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనలతో మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు ఫైనాన్సింగ్ అరికట్టడంతో పాటు వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ఫారెక్స్ ఆఫీసులపై నిఘా కొనసాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే..హోటల్, టూరిజమ్ అఫీసులలో విదేశీ నగదు మార్చుకునేందుకు మినహాయింపు ఇచ్చారు. కానీ, తర్వాత ఆ విదేశీ నగదును కచ్చితంగా బ్యాంకుల్లోగానీ, లైసెన్స్ పొందిన ఫారెక్స్ ఆఫీసులలోగానీ అప్పగించి స్థానిక నగదును పొందాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు