తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్ కేసులు
- September 14, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గింది. 24 గంటల్లో రాష్ట్రంలో 1,417 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,513కు చేరింది. 24 గంటల్లో 13 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 974కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,479 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,27,007కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30532 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 34,427 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 21,69,339కు చేరింది.
జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 264, ఆదిలాబాద్ 12, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల్ 34, జనగాం 20, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులమ్మ గద్వాల్ 12, కామారెడ్డి 11, కరీంనగర్ 108, ఖమ్మం 37, కొమరం భీమ్ అసిఫాబాద్ 16, మహబూబ్ నగర్ 34, మహబూబాబాద్ 54, మంచిర్యాల్ 28, మెదక్ 13, మేడ్చల్ మల్కాజ్‌గిరి 25, ములుగు 9, నాగర్ కర్నూల్ 32, నల్గొండ 47, నారాయణ్‌పేట్ 1, నిర్మల్ 8, నిజామాబాద్ 67, పెద్దంపల్లి 39, రాజన్న సిరిసిల్ల 24, రంగారెడ్డి 133, సంగారెడ్డి 107, సిద్ధిపేట్ 75, సూర్యాపేట 34, వికారాబాద్ 6, వనపర్తి 19, వరంగల్ రూరల్ 20, వరంగల్ అర్బన్ 70, యాద్రాది భువనగిరి 23 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







