విద్యార్థులకు భారీ డిస్కౌంట్లు ప్రకటించిన 'ఎమిరేట్స్'

- September 14, 2020 , by Maagulf
విద్యార్థులకు భారీ డిస్కౌంట్లు ప్రకటించిన \'ఎమిరేట్స్\'

యూఏఈ: దుబాయ్ అధికారిక ఎయిర్లైన్స్ అయిన 'ఎమిరేట్స్' విద్యార్థులకు భారీ డిస్కౌంట్లు అందిస్తూ ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. కరోనా సంక్షోభంలో ఆర్ధిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్టు ఎమిరేట్స్ సంస్థ తెలిపింది.

చదువుకునేందుకు వేరే దేశంలో ఉంటున్న విద్యార్థులు తమ ఇంటికి వెళ్లాలనుకున్నా, లేక సెలవుల్లో స్నేహితులతో కలిసి వేరే ఏదైనా ప్రదేశం సందర్శించాలన్నా, విద్యార్థులకు పలు డిస్కౌంట్లు అందిస్తోంది ఎమిరేట్స్. ఎకానమీ మరియు బిజినెస్ క్లాస్ ఛార్జీల పై ప్రత్యేక తగ్గింపు, అదనపు బ్యాగేజ్ అలవెన్సు, మరియు ప్రయాణానికి ఏడు రోజుల ముందు బుకింగ్ తేదీ మార్పు ఉచితంగా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.

ఈ ఆఫర్ ను విద్యార్థులే కాకుండా విద్యార్థులతో ప్రయాణించే కుటుంబ సభ్యులు కూడా వర్తిస్తుంది అని ఎమిరేట్స్ తెలిపింది.

ఈ ఆఫర్ ను పొందదలచినవారు 2020 అక్టోబర్ 31 లోపు టికెట్లు బుక్ చేసుకొని ప్రమోషనల్ కోడ్ STUDENT ఉపయోగించాలి. అన్ని టిక్కెట్ల పై గరిష్టంగా 12 నెలల స్టే చెల్లుబాటును కలిగి ఉంటాయి. STUDENT అనే ప్రోమో కోడ్‌ను ఉపయోగించి ప్రయాణికులు ఎకానమీ క్లాస్ ఛార్జీలపై 10 శాతం తగ్గింపు లేదా బిజినెస్ క్లాస్‌లో 5 శాతం తగ్గింపు పొందవచ్చు. వారు బయలుదేరే తేదీ 7 రోజుల వరకు ఒక ఉచిత తేదీ మార్పును మరియు బ్యాగేజ్ అలవెన్సు పైన 10 కిలోల ఎక్కువ లేదా ఒక అదనపు భాగాన్ని పొందుతారు.

విద్యార్థులు, చెక్-ఇన్ వద్ద చెల్లుబాటు అయ్యే విద్యార్థి ఐడి లేదా పాఠశాల అంగీకార లేఖను సమర్పించాలి.
ఆఫర్ పై మరింత సమాచారం కొరకు ఈ లింక్ చూడగలరు.. https://www.emirates.com/english/destinations_offers/student-special-fares/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com