24 మంది పార్లమెంట్ సభ్యులకు కరోనా పాజిటివ్..

- September 14, 2020 , by Maagulf
24 మంది పార్లమెంట్ సభ్యులకు కరోనా పాజిటివ్..

న్యూ ఢిల్లీ:నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో మొదటి రోజు సోమవారం లోక్‌సభ సభ్యులకు కోవిడ్ పరీక్ష నిర్వహించారు. అందులో 24 మంది సభ్యులు కరోనావైరస్ బారిన పడినట్లు తెలిసింది. వైరస్ బారిన పడిన 24 మందిలో మీనాక్షి లెఖీ, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేష్ సాహిబ్ సింగ్ ఉన్నారు అని జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఆలస్యంగా మొదలైన సెషన్ యొక్క మొదటి రోజు, లోక్‌సభ సమావేశాలకు దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. 30 మందికి పైగా ప్రధాన గదికి పైన ఉన్న సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సభ్యుల మధ్య దూరాన్ని పాటించేందుకు వీలుగా ప్లాస్టిక్ తెరలను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఆరుగురు సభ్యులకు వసతి కల్పించే బెంచీలకు కేవలం ముగ్గురు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగగా, రాజ్యసభ మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు జరగనుంది. కొత్త సభ్యులు అజిత్ కుమార్, పూలో దేవి నీతమ్ ల చేత చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com