ఉత్తమ నగరంగా హైదరాబాద్
- September 15, 2020
హైదరాబాద్:హైదరాబాద్ కి మరో విశిష్ట ఘనత దక్కింది.భారత దేశంలోనే ఉత్తమ నగరంగా హైదరాబాద్ నగరం ఎంపికైంది. హాలిడిఫై.కామ్ అనే వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు నిర్థారణ అయింది. నివాసయోగ్యం, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు హైదరాబాద్‌లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా సర్వేలో తేలింది.ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ మొదలైనవి పర్యాటకుల దృష్టిని ఆకర్షించినట్లు వెల్లడైంది.హైదరాబాద్ పర్యాటక కేంద్రాల్లో చరిత్రాత్మక చార్మినార్, గొల్కొండ కోట నిలిచాయి. ఆయా నగరాల్లో పటిష్ఠమైన అవకాశాలు, సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలతో ఈ సర్వేను నిర్వహించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







