దుబాయ్:స్విమ్మింగ్ పూల్ లో చిక్కుకుపోయిన మూడేళ్ల చిన్నారిని రక్షించిన పోలీసులు
- September 16, 2020దుబాయ్:దుబాయ్ పోలీసులు స్విమ్మింగ్ పూల్ లో చిక్కుకుపోయిన బాలుడ్ని రక్షించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించారు. స్విమ్మింగ్ పూల్ డ్రైయిన్ లో మూడేళ్ల బాలుడి చెయ్యి ఇరుక్కుపోయింది. దీంతో ఆ చిన్నారి బయటికి రాలేక అవస్థ పడుతుండటంతో తల్లిదండ్రులు తమ బాబును రక్షించాలంటూ పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి బాలుడ్ని సురక్షితంగా రక్షించారు. దుబాయ్ లోని ఓ ఇంట్లో వ్యక్తిగత స్విమ్మింగ్ ఫూల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటున్న చిన్నారి డ్రైయిన్ మూతను తొలగించటంతో చిన్నారి చెయ్యి అందులో ఇరుక్కుపోయింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు స్విమ్మింగ్ పూల్ లోని నీటిని తొలగించటంతో పాటు ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్పాట్ కు ఆంబులెన్స్ ను పిలిపించారు. ఆ తర్వాత ప్రత్యేక పరికరాలతో డ్రైయిన్ చుట్టు ప్రాంతాన్ని పగలగొట్టి పైప్ లైన్ ను తొలగించి బాబు చెయ్యిని బయటికి తీశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ఆంబులెన్స్ సిబ్బంది బాబుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్