సీఎం జగన్‌ను కలిసిన నటుడు అలీ
- September 16, 2020
తాడేపల్లి: దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యాద పూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. సహజంగా ఆయన మంచి చేస్తున్నపుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారు. వారు చేయలేక పోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తార’ని అలీ అన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో రాష్ట్రమంతా పర్యటించి పార్టీ తరపున ఆయన విస్తృత ప్రచారం చేశారు. కరోనా సంక్షోభంతో దాదాపు ఆరు నెలల పాటు నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. థియేటర్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సినిమా పరిశ్రమకు చెందిన వారు కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!







