70వ పడిలోకి అడుగు పెట్టిన భారత ప్రధాని మోదీ
- September 17, 2020
న్యూ ఢిల్లీ:భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పడిలోకి అడుగు పెట్టారు. ఇవాళ ఆయన పుట్టినరోజు నేపథ్యంలో సేవా సప్తాహ్‌ని పాటించాలని బీజేపీ నిర్ణయించింది. అంటే వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రజలకు శానిటైజర్లు, మాస్కులు, మందులు పంపిణీ చేస్తారు. అలాగే రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు వేడుకల్లో నిమగ్నమయ్యారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. కరోనా వైరస్ కారణంగా తన పుట్టిన రోజును నిరాడంబరంగా నిర్వహించుకోవాలని మోదీ నిర్ణయించారు.
70 సంఖ్యను ప్రతిబింబిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ శ్రేణులంతా సేవా వారోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, సాధించ తలపెట్టిన లక్ష్యాలను వివరిస్తూ 70 వర్చువల్ కాన్ఫరెన్స్‌లను వెబినార్ ద్వారా నిర్వహించనున్నారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలకు సంబంధించిన 70 స్లైడ్స్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేయనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







