బహ్రెయిన్:దోపిడికి పాల్పడిన అరగంటలో నిందితుల అరెస్ట్
- September 17, 2020
మనామా:ఓ మహిళలను బెదిరించి ఆమె బ్యాగును ఎత్తుకెళ్లిన కేసును కేవలం అరగంటలో చేధించారు బహ్రెయిన్ పోలీసులు. సీఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నడుచుకుంటు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. ఆమె దగ్గరున్న బ్యాగును లాక్కొని పారిపోయారు. చోరిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు..కేవలం అరగంట వ్యవధిలో ఆ దొంగలు ఇద్దరిని గుర్తించి పట్టుకున్నారు. వారి నుంచి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. దోపిడి పాల్పడిన ఇద్దరిలో ఒకరు 21 ఏళ్లు, మరొకరు 30 ఏళ్ల వయస్సు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణకు సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







