కరోనా ఫ్రంట్ లైనర్స్ కి 2 నెలల జీతం, మెడల్ ప్రకటించిన కువైట్
- September 17, 2020
కువైట్ సిటీ:కరోనా మహమ్మారి ప్రబలుతున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రణాలను రిస్క్ చేసి విధులు నిర్వహించిన కరోనా ఫ్రంట్ లైనర్స్ ప్రొత్సహాకాలు ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. కువైట్ లోని అన్ని సెక్యూరిటీ విభాగాల ఉద్యోగులకు 2 నెలల జీతంతో మెడల్ ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సమర్ధవంతంగా అమలు చేయటంలో కీలక పాత్ర పోషించిన ఫ్రంట్ లైనర్స్ సేవలను గుర్తించటం తమ బాధ్యతగా భావిస్తున్నామని అంతర్గత వ్యవహారల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తన ప్రకటన వెల్లడించారు. కువైట్ ఆర్మీ, కువైట్ పోలీస్, నేషనల్ గార్డ్, కువైట్ ఫైర్ సర్వీస్ విభాగాల ఉద్యోగులు ప్రభుత్వ ప్రకటించిన ప్రొత్సహకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అయితే...కరోనా సమయంలో సేవలు అందించిన తమ సిబ్బందికి మూడు నెలల జీతం ఇవ్వాలని అన్ని భద్రత విభాగాల అధిపతులు తొలుత కోరాయి. మెడల్ ద్వారా లభించే అలవెన్సులు అవసరం లేదని ప్రతిపాదించాయి. కానీ, మంత్రిత్వ శాఖ భద్రత సిబ్బందికి మెడల్ ఇచ్చేందుకే మొగ్గు చూపింది. దీంతో ఆయా భద్రతా విభాగాల్లోని సిబ్బందికి రెండు నెలల పూర్తి వేతనం(ఎలాంటి కోతలు లేకుండా) నెలకు 75KD మెడల్ అలవెన్స్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







