ద రైజ్ ఆఫ్ 'మోసగాళ్లు'ను ఆవిష్కరించిన 'విక్టరీ' వెంకటేష్
- September 18, 2020
హైదరాబాద్:'విక్టరీ' వెంకటేష్ శుక్రవారం ద రైజ్ ఆఫ్ 'మోసగాళ్లు' (సినిమా టైటిల్ థీమ్ మ్యూజిక్)ను ఆవిష్కరించారు.భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ క్రాస్ఓవర్ ఫిల్మ్‌ను నిర్మాతలు విలక్షణంగా, విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు.థీమ్ మ్యూజిక్ ఉత్తేజభరితంగా ఉండి, కుర్చీలలో మునివేళ్లపై కూర్చొని చూసే థ్రిల్లర్‌గా సినిమా ఉంటుందనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది.
100 అమెరికన్ డాలర్ల నోట్‌ను ఉపయోగించి డిజైన్ చేసిన టైటిల్ ద రైజ్ 'మోసగాళ్లు'లో ఆవిష్కృతమైంది. మొత్తంగా, ఇది సూపర్బ్‌గా, సమ్మోహనభరితంగా ఉందని చెప్పాలి.
విష్ణు మంచు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించనుండటం ఈ చిత్రంలోని విశేషం.భారత్‌లో మొదలై, అమెరికాను వణికించిన చరిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా 'మోసగాళ్లు' చిత్రం రూపొందుతోంది.బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
తారాగణం:
విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, నవదీప్, నవీన్ చంద్ర, రుహీ సింగ్
సాంకేతిక బృందం:
సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ
ప్రొడక్షన్ డిజైన్: కిరణ్‌కుమార్ ఎం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్.
నిర్మాత: విష్ణు మంచు
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?