భూమిపుత్ర క్రియేషన్స్ ఫస్ట్ లుక్ విడుదల

- September 18, 2020 , by Maagulf
భూమిపుత్ర  క్రియేషన్స్ ఫస్ట్ లుక్ విడుదల

హైదరాబాద్:భూమిపుత్ర  క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రోడక్షన్ నెం-1  అనే చిత్రం ద్వారా రామ్  అగ్నివేశ్ నాయుడు అనే నూతన నటుడుని పరిచయం చేస్తున్నాము. తన కెరక్టర్  కృష్ణుడు కి రిలెటెడ్ గా ఉంటుందని, దానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను "రామ్ అగ్నివేశ్ నాయుడు"  పుట్టిన రోజు సందర్బంగా నిన్న రిలీజ్ చేసినట్టు ప్రాజెక్ట్ క్రియెటివ్ హెడ్ సిద్ధం మనోహర్ తెలియజేసారు. ప్రస్తుతం దీనికి  సంబందించిన వర్కు షాప్స్ జరుగుతున్నాయని,  అక్టోబరు మొదటి వారంలో షూటింగ్ కి  వెళ్ళబోతున్నట్లు సిద్ధం మనోహర్ తెలిపారు.
 రామ్ అగ్నివేశ్ నాయుడు మాట్లాడుతూ  భూమిపుత్ర  క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రోడక్షన్ నెం-1 అనే  మూవీలో లీడ్ రోల్ ప్లే చేయడం చాలా ఎక్సైటింగా ఉందని,కథలో తన క్యారక్టర్ చాలా బాగా డిజైన్ చేశారని, తన మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని, సినిమా కోసం రాత్రింపగళ్ళు కష్టపడుతానని  రామ్ అగ్నివేశ్ నాయుడు పేర్కొన్నారు.
ఇది  crowd funded movie  అని, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అందరూ కొత్త వారే అని, దీనికి సంబందించిన మిగతా విషయాలు త్వరలో తెలియపరుస్తామని చిత్రం యూనిట్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com