రియాద్-లక్నో: భారీగా బంగారం పట్టివేత
- September 18, 2020
లక్నో:అక్రమ బంగారం రవాణాకు కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట పడటం లేదు. ఏదో ఒక రూపంలో బంగారాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా భారీగా విదేశాల నుంచి బంగారాన్ని తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా లక్నో కస్టమ్స్ అధికారులకు ఏకంగా రూ. 2 కోట్లు విలువ చేసే 3.8కిలోల బంగారం పట్టుబడింది. లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన జరిగింది. రియాద్ నుంచి లక్నో జీ8 6451 విమానంలో వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదా చేయగా, భారీ మొత్తంలో బంగారం దొరికింది. మొత్తం 33 గోల్డ్ బిస్కెట్లను ప్రయాణికుడి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం గోల్డ్ 3,849.12 గ్రాములని, మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 2 కోట్ల 9 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, నిందితుడు గోల్డ్ బిస్కెట్లను సెల్లోటేప్లో చుట్టి, అతని అండర్ గార్మెంట్లోని నల్ల రంగు పర్సులో దాచి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.

తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







