కోవిడ్ 19: వేడుకలైనా, అంత్యక్రియలైనా 10 మందికే అనుమతి..యూఏఈ కొత్త మార్గదర్శకాలు

- September 19, 2020 , by Maagulf
కోవిడ్ 19: వేడుకలైనా, అంత్యక్రియలైనా 10 మందికే అనుమతి..యూఏఈ కొత్త మార్గదర్శకాలు

యూఏఈ: కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇంట్లో జరిగే ఏ శుభకార్యాలైనా పది మందికి మించి జనం ఉండకూడదని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు..అంత్యక్రియలకు కూడా పది మించి హజరుకావొద్దని వెల్లడించింది. కోవిడ్ 19ను అడ్డుకునేందుకు కుటుంబ వేడుకల విషయంలో జాతీయ విపత్తు నిర్వహణ అధికార విభాగం ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జన సమూహాలను వీలైనంత మేర నియంత్రించటం..తద్వారా కోవిడ్ చైన్ బ్రేక్ చేయటమే లక్ష్యంగా వేడుకలకు హజరయ్యే అతిధిల సంఖ్యను కేవలం పది మందికే పరిమితం చేసింది. ఇక నుంచి ఇంట్లో జరిగే ఏ వేడుకకైనా అతి ముఖ్యమైన కుటుంబసభ్యులు అది కూడా 10 మందికి మించకుండా హజరవ్వాలని సూచించింది. అంతేకాదు..వేడకలో బఫెట్ విధానాన్ని పూర్తిగా నిషేధించింది. ఖచ్చితంగా డిస్పోజల్ ప్లేట్లు, గ్లాసులను మాత్రమే వాడాలని కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. వేడుకలకు హజరయ్యే ఆ 10 మంది కూడా 24 గంటల ముందే కోవిడ్ టెస్టులు చేయించుకుంటే ఉత్తతమమని వెల్లడించింది. ఒకవేళ ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే..వారిని ఐసోలేట్ చేసేందుకు ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఇదిలాఉంటే అంత్యక్రియల విషయంలో కొత్త నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించింది. అంత్యక్రియలకు హజరయ్యే వారి సంఖ్య ఎట్టిపరిస్థితుల్లో 10 మందికి మించి ఉండొద్దని, స్మశానవాటికల్లోని సిబ్బంది ఖచ్చితంగా గ్లౌజులు, మాస్కులు  ధరించాలని సూచించింది. ఒకవేళ సిబ్బందిలో ఎవరైనా శ్వాసకోసం ఇబ్బందులు ఉన్నా..కరోనా లక్షణాలు కనిపించినా వారు అంత్యక్రియలకు హజరుకావొద్దని  NCEMA పేర్కొంది. వేడుకలు, అంత్యక్రియల సమయంలో  NCEMA విడుదల చేసిన మార్గనిర్దేశకాలను అమలు చేసే బాధ్యత స్థానిక అధికారులదేనని, స్థానిక అధికారులు వారి పరిధిలో జరిగే వేడుకలను పర్యవేక్షించి నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com