త్రీడీ ప్రింట్ ద్వారా దుబాయ్ మెట్రో విడి పరికరాలు ఆవిష్కరించిన ఆర్టీఏ
- September 19, 2020
దుబాయ్: అసలే కరోనా క్లిష్ట పరిస్థితులు. ఈ సమయంలో పారిశ్రామిక ఉత్పత్తుల సామర్ధ్యం అతంత మాత్రంగానే ఉంటోంది. ఒకవేళ ఉత్పత్తి ఉన్నా..వాటి తయారీ ఖరీదు గతంలో కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే..ఈ అవరోధాలన్నింటికి సమాధానంగా దుబాయ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుంచుకుంటోంది. ఏకంగా దుబాయ్ మెట్రోకు కావాల్సిన విడి బాగాలను త్రీడీ ప్రింట్ ద్వారా రూపొందిస్తూ మెట్రో సమస్యకు పరిష్కారం చూపించింది. అంతేకాదు గతంలో విడిభాగాలు తయారు చేసిన సమయంతో పోలిస్తే త్రీడీ ప్రింట్ ద్వారా 90 శాతం సమయాన్ని ఆదా చేస్తోంది. దుబాయ్ మెట్రో నిర్వహణ కాంట్రాక్ట్ సంస్థ సెర్కొతో కలిసి విడి భాగాల తయారీ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీఏ అనుసరిస్తున్న త్రీడీ ప్రింట్ టెక్నాలజీకి సంబంధించి చిన్న వీడియో క్లిప్ ను తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







