కోవిడ్ -19 వ్యాక్సిన్: మొదటి టీకా వేయించుకున్న ఆరోగ్య శాఖ మంత్రి
- September 19, 2020
యూఏఈ: యూఏఈ ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఒవైస్ కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క మొదటి డోసును శనివారం వేయించుకున్నారు.
వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (మోహప్) ఆమోదం తెలుపగా దానికి అనుగుణంగానే మంత్రి ఒవైస్ కరోనా టీకాను స్వీకరించారు.
"క్లినికల్ ట్రయల్స్ యొక్క ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. టీకా సురక్షితమైనది మరియు ప్రభావవంతమైనది. ఇది టీకా లైసెన్సింగ్ విధానాలకు మరియు చట్ట నిబంధనలకు లోబడి తయారుచేయబడింది" అని ఆయన చెప్పారు.
"క్లినికల్ ట్రయల్స్ సరైన మార్గంలో పయనిస్తున్నాయి, ఇప్పటివరకు అన్ని పరీక్షలు విజయవంతమయ్యాయి" అని కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నవాల్ అల్ కాబీ అన్నారు. "అధ్యయనం ప్రారంభమైన ఆరు వారాలలోపు 31,000 మంది వాలంటీర్లు క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. ఇప్పటివరకు నివేదించబడిన దుష్ప్రభావాలు ఇతర టీకా మాదిరిగా తేలికపాటి మరియు ఊహించినవే; తీవ్రమైన దుష్ప్రభావాలు ఏవీ ఎదుర్కోలేదు. శరీరంలో యాంటీబాడీ ఉత్పత్తి పరంగా ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 1,000 మంది వాలంటీర్లపై ఈ టీకా పరీక్షించగా ఎటువంటి సమస్యలు తలెత్తకపోవటం ఏంటో సంతృప్తినిస్తోంది” అని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్‌ను జయించి..మారథాన్ రన్నర్‌గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!









