ఒమన్ లోని 10 వాణిజ్య రంగాల్లో అత్యధిక రిజిస్ట్రేషన్లు..

- September 20, 2020 , by Maagulf
ఒమన్ లోని 10 వాణిజ్య రంగాల్లో అత్యధిక రిజిస్ట్రేషన్లు..

ఓమన్ వాణిజ్య రంగానికి సంబందించి అత్యధికంగా 10 రంగాల్లో ఎక్కువగా యాక్టివిటీస్ రిజిస్టర్ అయినట్లు వాణిజ్య, పరిశ్రమ, పెట్టుబడుల ప్రొత్సాహక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భవన నిర్మాణ కాంట్రాక్ట్, ఎగుమతులు-దిగుమతులతో సహా పది రంగాల్లో ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య 21,981కు చేరుకుందని వివరించింది. ఈ పది రంగాల్లో అత్యధికంగా భవన నిర్మాణ కాంట్రాక్టు కార్యకలాపాలు 4,080వరకు రిజిస్టర్ అయ్యాయి. ఆ తర్వాత ఎగుమతి-దిగుమతి రంగంలో 3,122 కార్యాలయాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కిరాణా దుకాణాలు 2,372 రిజిస్ట్రేషన్లతో మూడవ స్థానంలో ఉన్నాయి, కాఫీ షాపులు 2,001 తో నాలుగవ స్థానంలో, రిఫ్ట్రిజిరేటర్ సంస్థలు 1,886 రిజిస్ట్రేషన్లతో ఐదవ స్థానంలో ఉన్నాయి. ఇక కాఫీ షాపులు 1,869 రిజిస్ట్రేషన్లతో ఆరో స్థానంలోనూ..అరబ్ మహిళల దుస్తులను టైలరింగ్, కుట్టు రంగం 1,783 రిజిస్ట్రేషన్లతో ఏడవ స్థానంలో ఉంది. ఎనిమిదవ స్థానంలో ఉన్న సేకరణ కార్యకలాపాల రంగంలో  1,757 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. హెయిర్ డ్రెస్సింగ్, షేవింగ్ సెలూన్లు 1,617 రిజిస్ట్రేషన్లతో తొమ్మిదవ స్థానం, ట్రక్కుల ద్వారా వస్తు రవాణా 1494 రిజిస్ట్రేషన్లను నమోదు చేసుకొని పదవ స్థానంలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com