త్వరలో వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్న రేణూ దేశాయ్
- September 20, 2020
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ సినిమాలకు దూరమై చాలా ఏళ్లవుతోంది. ఆమె రీఎంట్రీపై ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. అయితే, తన రీఎంట్రీపై స్వయంగా ఆమే స్పందించింది. త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు కెమెరా ముందుకొస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. కృష్ణమామిడాల డైరెక్షన్ వస్తున్న ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో షూటింగ్ జరుపుకోనుందని తెలిపారు. డీఎస్.రావు, ఎస్.రజనీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ‘చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకొస్తున్నాను. ఓ అందమైన వెబ్ సిరీస్‌లో నటించేందుకు సంతకం చేశానని ప్రకటిస్తున్నందుకు ఎక్జైయిటింగ్గా ఉంది. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది.
త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు చెప్తాను. సత్యాన్వేషణలో ఉన్న ఓ మహిళ ప్రయాణానికి మీ ఆశీస్సులు, ప్రేమను అందించాలని కోరుకుంటున్నా’అని రేణూ ఇన్‌స్టా పోస్టులో వెల్లడించారు. కాగా, తన కుమారుడు అకీరా నందన్ సినీరంగ ప్రవేశంపై కూడా ఆమె ఇటీవల క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి రావడం అనేది పూర్తిగా తన ఇష్టమేనని స్పష్టం చేశారు. రేణూ ప్రస్తుతం దర్శకురాలిగా బిజీగా ఉన్నారు. ఇదిలాఉండగా.. మహేష్‌బాబు సినిమాలో రేణుదేశాయ్ నటించబోతున్నారన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇటీవల ఇచ్చారు. వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!