ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో అరుదైన రికార్డు..
- September 20, 2020
దుబాయ్:ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ క్రికెట్ స్టేడియం లో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 20వ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 30 రన్స్ చేయడం జరిగింది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఇన్ని రన్స్ నమోదు కావడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.
ఢిల్లీ బాట్స్‌మెన్ స్టోయినిస్ 20వ ఓవర్ మొదటి బాల్‌కు 6 కొట్టగా.. ఆ తర్వాత వైడ్.. నెక్స్ట్ మూడు బంతుల్లో 3 ఫోర్లు బాదాడు. 5వ బంతిని సిక్స్‌గా మలిచిన స్టోయినిస్.. 6వ బంతికి రన్ తీస్తూ రనౌట్ అయ్యాడు. అయితే అది నోబాల్ కావడంతో ఢిల్లీ ఖాతాలోకి ఒక పరుగు వచ్చింది. ఇక చివరి బంతికి నార్టే 3 రన్స్ తీయడంతో 20 ఓవర్లో 30 రన్స్ వచ్చాయి. దీనితో ఐపీఎల్ చరిత్రలో 20 ఓవర్‌లో 30 రన్స్ తీసిన తొలి జట్టుగా ఢిల్లీ నిలవడమే కాకుండా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







