దేశంలో వైద్యుల పట్ల దృక్పథం మారాలి-తెలంగాణ గవర్నర్
- September 21, 2020
హైదరాబాద్: వైద్యుల పట్ల ప్రజల దృ క్పథంలో మార్పు రావాలని, వారి సేవలు, ఇబ్బందులను ప్రజలు గుర్తించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. వైద్యులపై రోగుల బంధువులు దాడులకు పాల్పడుతుండడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. వైద్యులకు రక్షణ కల్పించడంతో పాటు ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించడానికి కేంద్రం ఇటీవల కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆన్లైన్ ద్వారా నిర్వహించిన అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ స్ కాన్వొకేషన్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు.
వైద్యులు సమర్థవంతమైన సేవలు అందిస్తుండడంతో దేశంలో కరో నా మరణాల రేటు (సీఎఫ్ఆర్) చాలా తక్కు వగా ఉందన్నారు. కరోనా సోకిన వైద్యులు, వైద్య సిబ్బందిలో మరణాల రేటు 15 శాతం ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు రాజన్ శర్మ, సెక్రటరీ జనరల్ అశోకన్, ఐఎంఏ వైస్ చైర్మ న్ అష్రఫ్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







