8 మంది రాజ్యసభ ఎంపీల సస్పెండ్
- September 21, 2020
న్యూ ఢిల్లీ:పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎంపీల సస్పెన్షన్ తీర్మానానికి రాజ్యసభ డిప్యూటి చైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదం తెలిపారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు నిన్న తీవ్ర్ స్థాయిలో ఆందోళన చేసాయి. బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలకు చెందిన ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా బిల్లు ప్రతులను ఎంపీలు చించి వేసారు.
దీనితో ఈ సెషన్ పార్లమెంట్ సమావేశాలు పూర్తి అయ్యే వరకు నిన్న నిరసన తెలిపి హడావుడి చేసిన 8 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల తీరుపై వెంకయ్య సభలోనే ఆగ్రహం వ్యక్తం చేసారు. బిజెపి ఎంపీలు ఈ తీర్మానం ప్రవేశ పెట్టగ దానికి చైర్మన్ ఆమోద ముద్ర వేసారు. నిన్న వ్యవసాయ బిల్లులను రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







