కువైట్‌లోని ఇంజనీర్లకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
- September 21, 2020
కువైట్ సిటీ: కువైట్‌లోని ఇండియన్ ఇంజనీర్లకు అక్కడి భారత దౌత్యకార్యాలయం కీలక సూచన చేసింది. ప్రస్తుతం ఎంబసీ నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ డ్రైవ్‌లో భాగంగా అక్రిడేషన్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లతో పాటు మిగతా ఇంజనీర్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. గత వారం భారత ఎంబసీ ఇండియన్ ఇంజనీర్ల కోసం ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో https://forms.gle/YRoQwFEu3YHURgCe6 లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ సెప్టెంబర్ 30గా ఎంబసీ పేర్కొంది. కనుక ఇండియన్ ఇంజనీర్స్ వీలైనంత త్వరగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని భారత దౌత్యకార్యాలయం ఆదివారం మరోసారి గుర్తు చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







